తెలంగాణ రాలేదు, మాట నిలబెట్టుకో: కెసిఆర్‌కు సురేఖ

K Chandrasekhar Rao - Konda Surekha
వరంగల్: మూడు నెలల్లో తెలంగాణ రాకుంటే తాను ముక్కు నేలకు రాస్తానని ఇటీవల జరిగిన ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారని, ఆయన తన మాటను నిలబెట్టుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ ఆదివారం వరంగల్ జిల్లాలో అన్నారు.

ఓట్లు, సీట్లు కెసిఆర్ లక్ష్యమన్నారు. తెలంగాణపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన వైఖరి ప్రకటించలేదని, కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే ముక్కు నేలకు రాయాలన్నారు. సెంటిమెంట్‌ను ఉపయోగించుకొని కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం అందరూ కలిసి ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

కెసిఆర్ నిజ స్వరూపాన్ని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని సురేఖ అన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు తాము దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కెవిపి డైరీ వైయస్ ప్రతిష్టను దిగజార్చేలా ఉందన్నారు.

కాగా కొద్ది రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల సమయంలో తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు మాట్లాడుతూ... మూడు నెలల్లో తెలంగాణ ఖాయమని, అలా అని కేంద్రం నుండి తనకు సంకేతాలు ఉన్నాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికల సమయంలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికార కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వదని, కెసిఆర్ చెప్పినట్లుగా మూడు నెలల్లోగా తెలంగాణ రాకపోతే ఆయన ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ విసిరారు. ఆయన చెప్పినట్లుగా ఖచ్చితంగా తెలంగాణ వస్తుందని చెబితే తాను ఉప ఎన్నికల బరిలో నుండి కూడా తప్పుకోవడానికి సిద్ధమని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+