ఇస్లాం వ్యతిరేక సినిమా చిచ్చు: రగులుతున్న జ్వాల

ఆందోళనకారులను నిరోధించడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. 20 మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ట్యునిస్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై నిరసనకారులు పెట్రోలు బాంబులు విసిరేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించి కాల్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఇస్లాం వ్యతిరేక చిత్రంతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా ప్రభుత్వం ప్రకటించినా నిరసనలు ఆగడం లేదు. కాగా చిచ్చు రగులుతున్న నేపథ్యంలో ట్యునీషియా, లిబియాలోని తమ సిటిజన్స్, స్టాఫ్‌ని అమెరికా వెనక్కి పిలుస్తోంది.
కాగా అంతకు నాలుగు రోజుల ముందు లిబియాలోని బెంఘాజీ నగరంలో అమెరికా కాన్సులేట్ పైన జరిగిన దాడిలో ఓ అమెరికన్ ఉద్యోగి మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. బుధవారం ఉదయం పలువురు నిరసనకారులు అమెరికా కాన్సులేట్ పైన దాడికి దిగారు. నిరసనకారులు భవనాన్ని చుట్టుముట్టి దానిపై గ్రనేడ్లు విసిరారు.
ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి యుఎస్ స్టేట్ డిపార్టుమెంట్ అధికారి. అధికారి మృతిని అమెరికా స్టేట్ సెక్రటరీ హిల్లరీ రోథం క్లింటన్ ధృవీకరించారు. ఈ దాడి ఘటనను హిల్లరీ తీవ్రంగా ఖండించారు. విషయం తెలియగానే స్పందించిన హిల్లరీ లిబియా అధ్యక్షుడు మహమ్మద్ మెగారిఫ్‌కు ఫోన్ చేసి.. లిబియాలో ఉన్న అమెరికాలకు అదనపు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు.
నిరసనకారులు తమ నిరసనలను ఇతర దేశాలకు కూడా వ్యాపింప చేసే అవకాశాలు ఉండవచ్చునని హిల్లరీ అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్న అమెరికన్లను, అమెరికన్ సముదాయాలను రక్షించాలని ఆయా దేశాలను హిల్లరీ కోరారు.












Click it and Unblock the Notifications