వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

34 నుండి 18కి, గ్రూప్ రాజకీయాలు: కిరణ్‌పై వివేక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vivek
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు వివేక్ మంగళవారం మరోసారి ధ్వజమెత్తారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ ఓటు బ్యాంక్ 34 శాతం నుండి 18 శాతానికి పడిపోయిందని, 52 ఉప ఎన్నికలు జరిగితే 50 ఉప ఎన్నికలలో డిపాజిట్‌లు కోల్పోయిందని, కేవలం రెండు నియోజకవర్గాలలో మాత్రం చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచిందని ఆరోపించారు.

కిరణ్‌ లీడర్ షిప్‌లో క్వాలిటీ కరువైందన్నారు. ఆయన ఎవరినీ కలుపుకొని వెళ్లడం లేదని, వర్గ రాజకీయాలు నెరపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ స్థానంలో సమర్థ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెసుకు అవసరముందన్నారు. బలమైన నాయకుడి నేతృత్వంలోనే 2014 సాధారణ ఎన్నికలకు కాంగ్రెసు వెళ్లాలన్నారు. అప్పుడే కాంగ్రెసు రాష్ట్రంలో గట్టెక్కుతుందని, కిరణ్ నేతృత్వంలో అయితే నష్టం తప్పదన్నారు.

ఈ నెల 30వ తేదిన తెలంగాణ మార్చ్‌లో తెలంగాణ ప్రజల సత్తా చూపిస్తామని వివేక్ అన్నారు. మార్చ్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణపై ఈ ప్రాంత ప్రజల అభిప్రాయలను తమ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. మనోభావాలను అధిష్టానం గుర్తిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు ఇంటికి వచ్చిన ఎంపి వివేక్ మీడియాతో మాట్లాడారు.

మరోవైపు కెకె నివాసంలో ఆయనతో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస రావు మాట్లాడారు. తెలంగాణ మార్చ్‌కు టి-కాంగ్రెసు ఎంపీలు మద్దతిస్తున్నారని, టిడిపి కూడా మద్దతిస్తే వారి వద్దకు వెళ్తామన్నారు. ఎంపీలు కేవలం మద్దతిస్తే సరిపోదని, కార్యకర్తలతో సహా వచ్చి పాల్గొనాలన్నారు.

కేంద్రంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంప్రదింపులు జరపడంలో తప్పేం లేదన్నారు. టిఆర్ఎస్ సంప్రదింపులు జరిపితే తాము ఉద్యమిస్తామని చెప్పారు. ఉద్యమాన్ని అణిచి వేయాలని ప్రభుత్వం చూస్తే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతామని ఆయన హెచ్చరించారు.

English summary

 Peddapally MP Vivek lashed out at CM Kiran Kumar Reddy on Tuesday. He blamed that Congress vote bank fell down from 34 percent to 18 percent in Kiran Kumar Reddy leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X