కొలువుదీరిన సర్వలోక మహా గణపతి: గవర్నర్ పూజలు

 Governor special pooja at khairatabad ganesh
హైదరాబాద్: ఖైరతాబాద్ భారీ గణపతి దేవుడు బుధవారం కొలువుదీరాడు. ఒక్కో సంవత్సరం ఒక్కో రూపంలో దర్శనం ఇచ్చే ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య ఈ సంవత్సరం సర్వలోక మహా గణపతిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. వినాయకుడు కొలువు దీరిన తర్వాత గవర్నర్ నరసింహన్ దంపతులు మధ్యాహ్నం వచ్చి ప్రత్యేక తొలి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దానం నాగేందర్, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

సర్వలోక మహా గణపతిగా...

58 అడుగులు ఎత్తున్న విఘ్నేశ్వరుడికి కుడి వైపు తుల్జాపూర్ భవానీ మాత ఉన్నారు. ఆమె ఛత్రపతి వీరశివాజీకి ఖడ్గం ప్రసాదిస్తున్నట్టుగా ఉంది. ఎడమ వైపు సప్తాశ్వరథ సారథి సూర్య భగవానుడు ఉన్నారు. మధ్యలో గణేశుడు ఉన్నారు. ఆ పైన బ్రహ్మ, సరస్వతి, శివుడు, పార్వతి, విష్ణు, లక్ష్మీ దేవిలు గణనాథున్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది. ఖైరతాబాద్ గణేషుడికి లడ్డూ ప్రసాదాన్ని తాపేశ్వరంలో ప్రత్యేకంగా తయారు చేయించారు.

3,500 కిలోల లడ్డూను వాహనంలో తీసుకు వచ్చారు. పద్మశాలి సంఘం పట్టు వస్త్రాలు సమర్పించింది. కాగా ఖైరతాబాద్ వినాయకుడిని భక్తులు దర్శించుకునేందుకు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ దారిలో వాహనాల రాకపోకలను నిషేధించారు. కొబ్బరి కాయ కొట్టే భక్తులకు ప్రత్యేక మార్గం గుండా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. పోలీసుల భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

విశాఖపట్నంకు చెందిన డిఎస్పీని ప్రత్యేకాధికారిగా నియమించారు. ఇద్దరు సిఐలు, పదిమంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుళ్లు, పదిమంది మహిళా పోలీసులు, ప్లాటూన్ బలగాలని నియమించారు. భక్తులు వచ్చే ప్రధాన రహదారుల్లో ఐదుచోట్ల మెటల్ డిటెక్టర్‌లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+