ట్యాంక్‌బండ్‌పైనేనని గవర్నర్‌కు చెప్పాం: కోదండరామ్

తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ట్యాంక్ బండ్ పైన విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మార్చ్‌ని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు. తెలంగాణవాదులంతా ఉద్యమం శాంతియుతంగా చేస్తుంటే అధికారంలో ఉన్న వారు రెచ్చగొట్టాలని చూడటం సరికాదన్నారు. పాలకులు అసాంఘిక శక్తులను రెచ్చగొట్టి మార్చ్‌ను అభాసుపాలు చేసే అవకాశముందని కోదండరామ్ అనుమానం వ్యక్తం చేశారు.
ఈ నెల 30న నిర్వహించే మార్చ్‌ను తెలంగాణ ప్రజలంతా కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా తెలంగాణ మార్చ్ నేపథ్యంలో తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నేతలతో కోదండరామ్ ఈ రోజు(బుధవారం) సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications