బావ చంద్రబాబు చెబితే సరే! ఎక్కడినుండైనా: బాలకృష్ణ

పార్టీ పటిష్టత కోసం త్వరలో తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు, తన బావ నారా చంద్రబాబు నాయుడు తనను కోరితే ఆయన చేయనున్న పాదయాత్రలో పాల్గొంటానని తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేస్తామన్నారు. పార్టీలోకి ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు కుటుంబం రావడం టిడిపికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
కాగా నందమూరి బాలకృష్ణ వచ్చే సాధారణ ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లడంతో అక్కడ పార్టీ బలోపేతంపై బాలయ్య ప్రత్యేకంగా దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చి రావిని తిరిగి పార్టీలోకి తీసుకు వచ్చారు. ఇటీవల తన ఇంటికి వచ్చిన రావిని స్వయంగా చంద్రబాబు ఇంటికి తోడ్కొని వెళ్లి, బాబు సమక్షంలో పార్టీలో చేర్పించారు.
గుడివాడ తన తండ్రి నియోజకవర్గం కావడంతో బాలయ్య దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అదే సమయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నేతలతో నిత్యం భేటీ అవుతూ ఆయా జిల్లాలో పార్టీ పరిస్థితి, ఎలా బలోపేతం చేయాలనే అంశాలపై వారితో చర్చిస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్త పర్యటనలకు కూడా బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. కాగా ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో చేసిన గణపతి పూజలో నారా చంద్రబాబు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications