స్థలం అమ్మకుంటే చంపేస్తా: ఎమ్మెల్యేపై ఫిర్యాదు

వడపర్తిలోని భూమి నీదేనా అని అడగ్గా.. సన్యాసిరావు ఔనని చెప్పారు. ఆభూమి తనకు కావాలని, వెంటనే తన ఇంటికి వచ్చి కలవాలని ఫోన్ పెట్టేశారు. దీనిని సన్యాసిరావు తేలిగ్గా తీసుకున్నాడు. సోమవారం తిరిగి అదే నంబర్ నుంచి సన్యాసిరాజుకు ఫోన్ వచ్చింది. ఆ భూమి సంగతి ఏమీ తేల్చుకున్నావంటూ సన్యాసిరాజును అడిగారు. తాను ఆ భూమిని వ్యవసాయం కోసం కొన్నానని దానిని అమ్మే ఉద్దేశం లేదని చెప్పాడు.
దీంతో ఆగ్రహానికి గురైన అవతలి వ్యక్తి నేనడిగితే కాదంటావా?..నేనెవరో తెలుసా..అధికార పార్టీ ఎమ్మెల్యేని బెదిరించారు. నిన్ను జుట్టుపట్టుకుని ఇంట్లో నుంచి లాక్కొచ్చి రిజ్రిస్టేషన్ చేయించుకుంటానని హెచ్చరించాడు. ఎదురు తిరిగితే ప్రాణాలు తీసేందుకు వెనుకాడను..నీకు 24 గంటలు సమయమిస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేశారు. మధ్యాహ్నం తెల్లటి మారుతీ కారులో కొంతమంది వ్యక్తులు సన్యాసిరాజు ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు.
దీంతో భయపడిన సన్యాసిరాజు ఎమ్మెల్యే నుంచి రక్షించాలంటూ ద్వారకా జోన్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లారు. ఫిర్యాదు తీసుకునేందుకు వెనుకాడడంతో తిరిగి మంగళవారం స్టేషన్‌కు వచ్చి సిఐని కలిసి ఫిర్యాదును అందజేశారు. మరోవైపు ఎమ్మెల్యే కన్నబాబు తనను చంపేస్తానని బెదిరించినట్టు సన్యాసిరాజు తమకు ఫిర్యాదు చేయలేదని ద్వారకా జోన్ సిఐ కృష్ణారావు తెలిపారు. తనను చంపుతానని కన్నబాబు బెదిరిస్తున్నట్టు రాతపూర్వకంగా సమాచారం ఇస్తున్నానని, ఫిర్యాదు మాత్రం కాదని తమతో చెప్పినట్టు సిఐ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని సిఐ చెప్పారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications