హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విలీనమైనా విభజనకు ఒప్పుకోం, కానీ...: టిజి వెంకటేష్

By Pratap
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
హైదరాబాద్: సమైక్యాంధ్ర తప్ప మరే నిర్ణయానికి కూడా తాము అంగీకరించబోమని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని కాంగ్రెసులో విలీనం చేస్తామన్నా కూడా తాము రాష్ట్ర విభజనకు అంగీకరించబోమని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అనుకోకుండా రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ పరిస్థితి ఏమిటని ఆయన అడిగారు. రాయలసీమ ప్రాంతం వెనకబడి ఉందని శ్రీకృష్ణ కమిటీ తేల్చిందని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ నేతల సమావేశం తర్వాత సీమాంధ్ర నేతలం ఢిల్లీ వెళ్తామని, తాము ఈ నెల 25, 26 తేదీల్లో ఢిల్లీ వెళ్తామని ఆయన చెప్పారు. ఈసారి సమైక్య నినాదంతో కాకుండా తమ ప్రాంతాల హక్కుల గురించి పార్టీ అధిష్టానాన్ని అడుగుతామని ఆయన చెప్పారు. సీమాంధ్ర నేతలం విడివిడిగా అధిష్టానాన్ని కలుస్తామని, రాష్ట్రాన్ని విభజిస్తే తమ హక్కులు ఏమవుతాయని అడుగుతామని ఆయన అన్నారు. సమైక్యనినాదంతో కాకుండా తమ మత ప్రాంతాలకు నిధులను రాబట్టుకోవడానికి అధిష్టానాన్ని విడివిడిగా కలుస్తామని ఆయన చెప్పారు.

ఉద్యమాలు చేస్తునే తెలంగాణ ప్రాంత నేతలు అభివృద్ధి చేసుకుంటున్నారని ఆయన అన్నారు. అది సంతోషకరమేనని, అయితే తమ ప్రాంతాలకు కూడా అభివృద్ధికి కావాలని ఆయన అన్నారు. అభివృద్ధే ప్రధాన ఎజెండాగా అధిష్టానాన్ని కలుస్తామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు తాము సమైక్య నినాదం వినిపించామని, ఇప్పుడు అభివృద్ధి ఎజెండా అధిష్టానాన్ని కలుస్తామని ఆయన చెప్పారు. జీవవైవిధ్య సదస్సుకు హైదరాబాదుకు వేయి కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు.

ఇప్పటికే అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నాయని ఆయన అన్నారు. తమ హక్కులపై అధిష్టానం హామీ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. సమైక్య రాష్ట్రం ఏర్పడినప్పుడు తమ ప్రాంతం నష్టపోయిందని, విభజన జరిగితే మళ్లీ నష్టపోతుందని ఆయన అన్నారు. తెలంగాణ నేతలను చూసి ఆంధ్ర నేతలు నేర్చుకోవాలని, అల్లరి చేస్తూనే ప్యాకేజీలు తెచ్చుకుంటున్నారని, దీన్ని తమ ప్రాంత నేతలు అర్థం చేసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు.

English summary
Minister from Rayalaseema region TG Venkatesh said that they will oppose bifurcation of Andhra Pradesh. He said that they will meet Congress high command in the last week of September.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X