ఇప్పటికి నేను మిస్టర్ క్లీన్, బద్నాం చేయొద్దు: ధర్మాన

Dharmana Prasad Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆదివారం తన రాజీనామా పైన, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన వివరణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన విచారణకు అనుమతి కోరుతూ సిబిఐ ప్రభుత్వానికి లేఖ రాసిందని, దానిపై ప్రభుత్వం తనను వివరణ కోరిందని ధర్మాన చెప్పారు.

సిబిఐ ఆరోపణలు అసంబద్దమని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదని తాను శనివారం రాత్రి తొమ్మిది గంటలకు కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వివరణ ఇచ్చానని చెప్పారు. న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత తన రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారని, రాజీనామా విషయంలో సర్వాధికారాలు ముఖ్యమంత్రివే అన్నారు. తాను రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బిజినెస్ రూల్స్ అతిక్రమించలేదని చెప్పారు.

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జివోలను జారీ చేశానని, సిబిఐ ఛార్జీషీట్ అసంబద్దమన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, మంత్రిని అయినంత మాత్రాన వ్యక్తిగత మినహాయింపులు ఉండవన్నారు. తప్పు చేసింది ఎవరో ప్రభుత్వానికి ఓ అవగాహన ఉంటుందన్నారు. తాను తెలిసి లేదా తెలియక ఒక్క పొరపాటు కూడా చేయలేదన్నారు. తాను కేవలం నిందితుడిని మాత్రమేనని, నేరస్తుడిని కాదన్నారు.

సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న తమను నేరస్తులుగా, కళంకిత మంత్రులుగా చిత్రీకరించడం సరికాదన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, దానిని ఏ స్థాయిలోనైనా నిరూపించుకుంటానని, తనకు ఆ విశ్వాసం ఉందని చెప్పారు. మంత్రవర్గం నిర్ణయం లేకుండా ముఖ్యమంత్రి లేదా సంబంధింత మంత్రి భూమిని పంచలేరన్నారు. అవగాహన లేమితో తనపై నేరస్తుడి ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పారు.

కేబినెట్ నిర్ణయం లేకుండా భూమిని పంచలేదన్నారు. ముఖ్యమంత్రి కూడా మంత్రివర్గ నిర్ణయం లేకుండా పంచలేరన్నారు. కోర్టులో రుజువైనప్పుడు మాత్రమే తాము చేసినవి నేరాలు అవుతాయని, ఇంకా విచారణ జరుగుతోందన్నారు. మంత్రివర్గం నిర్ణయం లేకుండా తాను ఒక్క అంగుళం భూమిని కూడా రెవెన్యూ మంత్రిగా కేటాయింపులు జరపలేదని, సిఎం అయినా సొంతగా నిర్ణయం తీసుకోలేరన్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా నేరస్తులు కాదని, సమగ్ర విచారణ తర్వాత కోర్టు తీర్పు వస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+