తల్లిని వేధిస్తున్నాడని వ్యక్తిని చంపిన 12 ఏళ్ల బాలుడు

తండ్రికి బదులు తన ఇంటికి పాలు తీసుకు రావాల్సిందిగా బాలుడి తల్లిని కమల్ ఆదేశించాడు. ఆమె నిరాకరించడంతో ఆగ్రహం చెందిన కమల్ ఆమెతో వాదనకు దిగాడు. ఆమె మెడను పట్టుకొని హెచ్చరించాడు. ఇదంతా ఇంట్లో నుండి చూస్తున్న బాలుడు ఒక్కసారిగా బయటకు వచ్చి అతనితో వాదనకు దిగాడు.
ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి తండ్రి ఉపయోగించే లైసెన్స్‌డ్ గన్ తీసుకు వచ్చి కమల్‌ను కాల్చాడు. దీంతో కమల్ రక్తపుమడుగులో కుప్పకూలాడు. స్థానికులు అతనిని దగ్గర్లోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ సెంటర్‌కు తరలించారు. కమల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని, జువైనల్ హోమ్‌కు తరలించారు. తన తల్లి క్యాన్సర్ పేషెంట్ అని, ఆమెతో ఎవరు మిస్ బిహేవ్ చేసినా ఇలాగే చేస్తానని చెప్పాడని, అందుకు అతను పశ్చాత్తాప పడటం లేదని పోలీసులు చెప్పారు.
జైల్లో ఉన్న భర్తను విడిపించేందుకు కొడుకుని అమ్మిన తల్లి
జైలులో ఉన్న తన భర్తను విడిపించుకోడానికి ఒడిషాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన పదిహేడు నెలల కొడుకును రూ.5 వేలకు అమ్మింది. జాజ్‌పూర్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముండమాల్ గ్రామానికి చెందిన రాఖీ పాత్రా (20) అనే మహిళ ఈనెల 13న కటక్ వెళ్లి, జగత్‌సింగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి తన కొడుకును అప్పగించినట్లు ఇన్‌స్పెక్టర్ అశ్విని కుమార్ సాహు తెలిపారు.
ఈ విషయం తెలిసిన ఆమె అత్త కనకలత పాత్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. జైల్లో ఉన్న తన భర్తను విడిపించడానికి తనకు డబ్బు అవసరమైందని.. అందుకే తన కొడుకును అమ్మేశానని ఆమె విచారణలో తెలిపింది. రాఖీ భర్త మనోజ్ పాత్రా ఓ దొంగతనం కేసులో జూలై 2 నుంచి జాజ్‌పూర్ జిల్లాలోని బగాడీ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. భార్యా భర్తలిద్దరూ రోజుకూలీ చేసి జీవనం సాగిస్తారు.
అత్తమామలు రాఖీని తమ ఇంట్లో ఉండనివ్వకపోవడం, తల్లిదండ్రులు ఈ సంఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉండటంతో.. ప్రస్తుతానికి ముందు జాగ్రత్తగా పోలీసులు ఆమెను సంరక్షణ కేంద్రంలో ఉంచారు. పిల్లాడి ఆచూకీ కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తహసిల్దార్ దీప్తిరాణీ సాహును ఈ విషయమై విచారణ జరపాల్సిందిగా ఆదేశించానని జిల్లా కలెక్టర్ అనిల్ సమాల్ తెలిపారు.












Click it and Unblock the Notifications