గర్వంగా ఉంది: మురళీ మోహన్, రామానాయుడు

దీనిని రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. ఇంత అద్భుత కార్యక్రమం జరగడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన్నారు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుత్తా జ్వాల కూడా పాల్గొన్నారు.
కాగా వచ్చే నెల (అక్టోబర్) నెల 1వ తారీఖు నుండి పందొమ్మిది రోజుల పాటు హైదరాబాదులో జీవ వైవిధ్య సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి నూటా ఎనభైకి పైగా దేశాల నుండి దాదాపు పదివేల మందికి పైగా ప్రముఖులు వస్తున్నారు. అక్టోబర్ 19వ తారీఖు వరకు ఈ సదస్సు జరుగుతుంది. రెండో వారంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హైదరాబాద్ వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications