డోంట్ వర్రీ, వస్తారు: జగన్ బెయిల్‌పై అంబటి విజ్ఞప్తి

Ambati Rambabu
హైదరాబాద్: పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన విచారణ వాయిదా పడినప్పటికీ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం అన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎవరు కూడా నిరుత్సాహపడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

జగన్ బెయిల్ పైన విచారణను సుప్రీం కోర్టు వచ్చే నెల 5వ తేదికి వాయిదా వేసినందున ఆ రోజుజగన్ తప్పకుండా విడుదలవుతారని అంబటి రాంబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) తరఫు న్యాయవాది కేసును స్టడీ చేయడానికి కొంత సమయం కావాలని అడిగినందువల్లే సుప్రీం కోర్టు కేసు విచారణను వాయిదా వేసినట్లుగా తమకు సమాచారం అందిందని చెప్పారు.

భవిష్యత్తులో సిబిఐ తన వ్యవహారశైలి పైన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావుకు ఓ న్యాయం, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో న్యాయమా అని అంబటి ప్రశ్నించారు.

కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. శుక్రవారం సుప్రీం కోర్టులోని ఐదో కోర్టులో విచారణకు రాగానే సిబిఐ తరఫు న్యాయవాది పరాశరణ్ న్యాయవాది మారినందున తమకు కొంత వ్యవధి కావాలని కోరారు. పరాశరణ్ విజ్ఞప్తి మేరకు సుప్రీం కోర్టు బెయిల్ పైన విచారణను వచ్చే శుక్రవారానికి(అక్టోబర్ 5)వ తేదికి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+