ముఖ్యమంత్రికి బాసట: ఎంపి పొన్నంపై జగ్గారెడ్డి ఫైర్

Jagga Reddy
హైదరాబాద్/ విశాఖపట్నం: కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పలువురు బాసటగా నిలిచారు. ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పొన్నం ప్రభాకర్‌పై వారు మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్ స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నారని కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిపై మాట జారితో తాము మరోలా స్పందిస్తామని ఆయన అన్నారు.

విడిపోయిన నేతలను పొన్నం ప్రభాకర్ ఏకం చేస్తున్నారని ఆయన అన్నారు. దుమ్ముంటే పొన్నం ప్రభాకర్ తెలంగాణ కవాతులో పాల్గొనాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రికి తెలంగాణకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, సునీతా రెడ్డి కూడా మద్దతు ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధికి కిరణ్ కుమార్ రెడ్డి కృషి చేస్తున్నారని వారు శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తమ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందిస్తున్నారని వారు చెప్పారు. తెలంగాణ మంత్రులను కిరణ్ కుమార్ రెడ్డి ఏ రోజు కూడా అగౌరవపరచలేదని వారు స్పష్టం చేశారు. తమకు ముఖ్యమంత్రి స్వేచ్ఛ ఇస్తున్నారని, తమకు పూర్తిగా సహకరిస్తున్నారని వారు చెప్పారు.

ముఖ్యమంత్రిపై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను రాయలసీమకు చెందిన మంత్రి శైలజానాథ్ ఖండించారు. సోనియా ఆశీస్సులతో రాష్ట్రంలో నడుస్తున్న కాంగ్రెసు ప్రభుత్వానికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని, అటువంటి ముఖ్యమంత్రిపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన శనివారం విశాఖపట్నంలో అన్నారు.

తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నడుపుతామని తెలంగాణవాదులు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ వల్లనే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఇది కాంగ్రెసు ప్రభుత్వ ప్రజాస్వామ్య వైఖరి అని ఆయన అన్నారు. తాము ఢిల్లీ వెళ్లి వచ్చామని, అక్కడ తెలంగాణ అంశంపై కదలిక లేదని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతోందని, దానికోసం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం లేదని శైలజానాథ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+