హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో కిషన్ రెడ్డికి బెదిరింపు: పాక్ వాసి పేరిట...

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట శాసనసభ్యుడు జి.కిషన్‌ రెడ్డికి మళ్లీ బెదిరింపు వచ్చింది. పాకిస్థాన్ దేశస్థుడిగా అనుమానిస్తున్న వ్యక్తి నుంచి ఈ బెదిరింపు వచ్చింది. ఇటీవల బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన తీవ్రవాదులు.. కిషన్‌ రెడ్డిని హతమార్చాలన్నది తమ ప్రణాళిక అంటూ విచారణలో వెల్లడించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి సామాజిక వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో కిషన్‌రెడ్డి ఫొటోపై ఎక్స్ మార్క్‌ను పెడుతూ.. ఇక్రంషా అనే వ్యక్తి పేరిట ఓ మెసేజ్ ప్రత్యక్షమైంది.

అందులో కిషన్‌ రెడ్డి పేరు ఎక్కడా పేర్కొనపోయినా... ఫొటో పెట్టి కిషన్‌ రెడ్డిని ఉద్దేశించి, ఉర్దూ భాష పదాలను ఇంగ్లీష్‌లో టైప్ చేశారు. ఇటీవల అసెంబ్లీలో మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా నిర్మించిన అమెరికా సినిమాకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. అత్యవసరమైన తెలంగాణపై తీర్మానం చేయకుండా సినిమాపై తీర్మానం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నట్లు వార్తలు వెలువడ్డాయి.

తర్వాత తానలా అనలేదని కిషన్‌ రెడ్డి ఖండించారు కూడా. ఈ నేపథ్యంలోనే మీ పని మీరు చేసుకోవాలని, మహమ్మద్ ప్రవక్తను కించపర్చిన అమెరికా సినిమా విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హెచ్చరిస్తూ కిషన్‌ రెడ్డిపై శనివారం ఫేస్‌బుక్‌లో మెసేజ్ ప్రత్యక్షమైంది. దీనిపై భారతీయ జనతా పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమగ్రంగా దర్యాప్తు చేసి, పాకిస్థాన్‌ వాసిగా అనుమానిస్తున్న నిందితుడి గత చరిత్రను తేల్చాలని, కిషన్‌ రెడ్డి భద్రతపై సమీక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

English summary
AP BJP unit chief G.Kishan Reddy on Saturday lodged a police complaint alleging that he received a death threat from a Pakistani naional on a social networking site.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X