హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

270 సీట్లలో సమైక్యవాదులే: లగడపాటి, కావూరి ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavuri samabasiva Rao - Lagadapati Rajagopal
హైదరాబాద్: తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరిస్తున్నారని, రాష్ట్రం అంతా ఒక్కటైనప్పుడు హైదరాబాదులో మాట్లాడే హక్కు సామాన్య ప్రజలకు లేదా అని ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు సోమవారం అన్నారు. సమైక్యవాదం కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏలూరు సిఆర్ఆర్ కళాశాలలో సీమాంధ్ర నేతలు సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో కావూరి మాట్లాడారు. సమైక్యవాదం గురించి వినిపించే తనను, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ను హైదరాబాద్ నుంచి బయటకు పంపిస్తే సమైక్యవాదం గురించి ఎవరూ నోరెత్తరనుకుంటున్నారు.

అసలు ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విడదీయాలనుకుంటున్నారో చెప్పాల్సి ఉందన్నారు. ప్రధానమంత్రిగా పని చేసిన పివి నరసింహ రావు తెలంగాణ వారని మేమెప్పుడు అనలేదని, మన తెలుగువాడు ప్రధాని అయ్యారని చెప్పుకునేవారమన్నారు. దౌర్జన్యాలు చేసినంత మాత్రాన రాష్ట్రాన్ని విడదీయలేరన్నారు. తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగుల్లో లేనిపోని భ్రమలను కల్పించి వారిని ఉద్యమాలకు ఉసిగొల్పుతున్నారన్నారు.

హైదరాబాద్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూసి తెలుగు తల్లి కన్నీళ్లు చిందిస్తుందని, ఆమెను ఓదార్చేవారే లేరని లగడపాటి రాజగోపాల్ అన్నారు. తన బిడ్డలు ఏ విధంగా కొట్టుకుంటున్నారో చూడలేక తెలుగుతల్లి ఆవేదన చెందుతుందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఇబ్బందులు తప్పవన్నారు. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదని, తెలంగాణా కవాతుకు అనుమతి ఇప్పించిన నాయకులకు మార్చ్ దరిదాపులకు వెళ్లే ధైర్యం లేకపోయిందన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే సమైక్యాంధ్రవాదులు 270 సీట్లల్లో విజయం సాధిస్తారన్నారు.

బలం ఉండీ గాంధేయవాదంతో వెళుతున్నామని, ఇక ఉద్యమాలు చేయక తప్పదన్నారు. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి తెలుగు భావనను రాష్ట్రమంతటా ప్రజల్లో కల్పించాలన్నారు. సీమాంధ్ర నేతలు మౌనంగా ఉన్నారని చులకనగా ప్రకటన చేస్తే సహించేది లేదన్నారు. హైదరాబాదు ఎవరి సొత్తు కాదని తీర్మానం చేయాలని లగడపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. హైదరాబాదు అందరిది అని అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు.

English summary

 Vijayawada MP Lagadapati Rajagopal said on Sunday in Eluru of West Godavari that we will win in 270 seats in Andhra Pradesh, who are giving slogan for the support of Unted AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X