పురాణాల్లోనే: జీవవైవిధ్య మీట్‌లో గవర్నర్ శాంతిమంత్రం

ఓం బ్రహ్మ శాంతి.. సర్వగుమ్ శాంతి అంటూ ఆయన తన ప్రసంగంలో చదివి పురాణాల్లోనే ప్రకృతిని రక్షించుకోవాలని చెప్పారన్నారు. జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. మాన మనుగడకు ప్రమాదకరంగా పరిణమించిన అంశాలపై ఈ సదస్సు పరిష్కారం చూపుతుందని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని నరసింహన్ చెప్పారు. పర్యావరణానికి అధిక క్రిమిసంహారక మందులు వాడకం కూడా హానికరంగా మారుతున్నాయన్నారు.
సర్వజీవాలకు, సృష్టి మూలాలకు శాంతి అవసరమనేది ఆర్యోక్తి అని ఆయన అన్నారు. మానవ చరిత్రలో పర్యావరణానికి చాలా ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. అనారోగ్యాలు, ఆకలి సమస్యలను అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. భూగర్భ జల వనరులు అడుగంటిపోవడం, సాగు భూములు తగ్గుదలపై సదస్సులో చర్చించి పలు సూచనలు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.












Click it and Unblock the Notifications