హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టోపీ పెట్టారు.. రమ్మన్నారు: నేరుగా లోకేష్ పైనే ఒత్తిళ్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nara Lokesh
హైదరాబాద్/అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌పై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. టిడిపి పునర్వైభవం కోసం నారా లోకేష్‌ను రాజకీయ ఆరంగేట్రం చేయించాలని కొంతకాలంగా నాయకులు, కార్యకర్తలు పార్టీ అధినేతపై ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే. పలు సందర్భాలలో పార్టీ సమావేశాలలో ఈ అంశంపై చర్చించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఆయా సమయాలలో పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు తనయుడి రాజకీయ ఆరంగేట్రానికి నిరాకరించారు. అయితే కొద్ది రోజులుగా బాబు వైఖరిలో మార్పు కనిపిస్తోంది. లోకేష్ ఎంట్రీపై ఎవరైనా ప్రస్తావిస్తే వద్దని చెప్పే బాబు ఇటీవల మౌనం వహిస్తున్నారు. దీంతో తనయుడి ఎంట్రీకి బాబు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. పాదయాత్రకు లోకేష్ రావడం, రెండు మూడు రోజుల పాటు బాబుతో కదం కలుపడం ఇవన్నీ లోకేష్ రాజకీయ ఆరంగేట్రం కోసమే అనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు కార్యకర్తలు, నాయకులు లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకు రావాలని విజ్ఞప్తులు చేశారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర సందర్భంగా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు నేరుగా లోకేష్ వద్దకే వెళ్లి రాజకీయ ఆరంగేట్రం చేయాలని కోరుతున్నారు. బుధవారం కోళ్లకుంట నుండి బాబు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సమయంలో లోకేష్ కూడా తండ్రి వెంటే ఉన్నారు. పలువురు మైనార్టీ సెల్ కార్యకర్తలు, నాయకులు లోకేష్‌ను కలుసుకున్నారు.

ఆయనకు తమ వద్ద ఉన్న టోపీ(క్యాప్)ని పెట్టారు. మీరు రాజకీయాల్లోకి రావాల్సిందేనని కండువా కప్పారు. దీంతో లోకేష్‌కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ప్రజలు బాబు పాదయాత్రకు హారతులు పడుతున్నప్పటికీ లోకేష్‌ను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. లోకేష్ తన తండ్రితో పాటు రెండు మూడు రోజులు యాత్రలో పాల్గొన తండ్రికి సౌకర్యాలను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత వేరేవారికి బాధ్యతలు అప్పగించి ఆయన యాత్ర నుండి తప్పుకుంటారు.

English summary

 Telugudesam Party activists and leaders are forcing TDP chief Nara Chandrababu Naidu's son Nara Lokesh while his father padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X