arvind kejriwal anna hazare congress bjp new delhi అరవింద్ కేజ్రీవాల్ అన్నా హజారే కాంగ్రెసు బిజెపి న్యూఢిల్లీ
'మా ఎమ్మెల్యేలు,ఎంపీలకు సౌకర్యాలొద్దు, 10 రోజుల్లో..'

గెలుపోటములతో సంబంధం లేకుండా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. స్వరాజ్‌కా సంకల్ప్ పేరుతో తమ పార్టీ విజన్ డాక్యుమెంట్‌ను ఆయన విడుదల చేశారు. ముస్లింల పరిస్థితిని మెరుగుపరచడం, ప్రజలకు ప్రత్యక్ష పాలన, అవినీతి, ధరల పెరుగుదలపై ఉద్యమం లాంటివి అందులో ఉన్నాయి. కాంగ్రెస్, బిజెపిలు బొగ్గు స్కాంతో దేశాన్ని దోచుకున్నాయని కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. మన దేశం రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26వ తేదీన తన పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు.
లోక్‌పాల్ లాంటి అంశాల గురించి తాము ప్రస్తావించినప్పుడు.. దమ్ముంటే ఎన్నికల్లో పోటీచేసి అప్పుడు చట్టాలు చేయడానికి ప్రయత్నించాలని నాయకులు సవాలు చేశారని, ఇప్పుడు ఎన్నికల్లో పోటీచేసి వారికి తమ దమ్మేంటో చూపిస్తామని కేజ్రీవాల్ అన్నారు. అవినీతిపరులైన నాయకులారా.. ఇక రోజులు లెక్క పెట్టుకోండని, ఇప్పుడిక విజ్ఞప్తులు ఉండవని, పూర్తిస్థాయి రాజకీయ యుద్ధమే అన్నారు. అసెంబ్లీలు, పార్లమెంటును ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఇంకా ఆలస్యం చేస్తే ఐదేళ్లలో దేశాన్ని అమ్మేస్తారన్నారు. రబ్రీదేవి బీహార్‌ను పాలించగలిగినప్పుడు.. సామాన్యులూ చట్టాలు చేయగలరని చెప్పారు. బ్రెజిల్‌లోని ఓ పట్టణంలో బడ్జెట్‌ను చట్టసభలలో కాక.. వీధుల్లో ప్రజల మధ్య రూపొందిస్తారని, అదే పద్ధతిని ఇక్కడా అవలంబించాలని అన్నారు. ప్రజలకు ప్రత్యక్ష అధికారం ఉండి తీరాల్సిందేనని, తాము అధికారంలోకి వస్తే ఈ పద్ధతిని అమలుచేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.
ఢిల్లీలో విద్యుత్, నీటి చార్జీలు పెంచడంపై షీలా సర్కారు మీద ఉద్యమాలతో విరుచుకుపడతామని ప్రకటించారు. ఇద్దరు 'పెద్ద నాయకుల'పై సంచలనాత్మక ఆరోపణలు చేయడానికి విలేకరుల సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, తిరస్కరించే హక్కు, రీకాల్ చేసే హక్కు వంటివి తమ పార్టీ లక్ష్యాలని కేస్రీవాల్ ప్రకటించారు.