ప్రియుడిపై దాడి చేసి ప్రియురాలిపై అత్యాచారం, పరారీ

బాధితుల ఆర్తనాదాలతో చుట్టుపక్కల వారు ఘటన స్థలానికి వచ్చారు. ఇది చూసిన దాడికి పాల్పడ్డ నలుగురు యువకులు అక్కడి నుండి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు చికిత్స కోసం వి.కోట ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స నిర్వహిస్తున్నారు. రంజిత, మునిరాజులుగా ఆ ప్రేమికులను గుర్తించినట్లుగా తెలుస్తోంది.
ఆర్పీఎఫ్ ఎస్సై గదిలో గంజాయి స్వాధీనం
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆర్పీఎఫ్ ఎస్సై గదిలో జిఆర్‌పి అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 150 కిలోల గంజాయి దొరికింది. దానిని జిఆర్‌పి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కడపలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
కడప జిల్లాలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. రైల్వే కొండాపురం నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న వాహనంలో రెండువేల జిలెటిన్ స్టిక్స్, 3వేల మీటర్ల తీగ, 25 బస్తాల అమ్మోనియం నైట్రేట్ బయటపడ్డాయి. వీటిని పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. రాజంపేటలోని ఒక కళాశాల వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో పోలీసులు రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications