నరేంద్ర మోడీపై సోనియా వ్యాఖ్య: చంద్రబాబుకు ప్లస్!

సోనియా ఘాటుగా చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలోని టిడిపి క్యాడర్ తమకు అనువయించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో గత కొంతకాలంగా టిడిపి నేతలు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు ఇక్కడి కాంగ్రెసు ప్రభుత్వంపై చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ ఫలాలను ఇన్నాళ్లు కాంగ్రెసు పార్టీ అనుభవించిందని, ముందుచూపు లేకుండా పాలించి, అందినకాడికి దోచుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపిస్తున్నారు.
ఇన్నాళ్లూ రాష్ట్ర కాంగ్రెసు నేతలు టిడిపి నేతల వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. అయితే ఇప్పుడు స్వయంగా సోనియా గాంధీ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ... మా ప్రభుత్వ ఫలాలు అనుభవించారని చెప్పడం గమనార్హం. బాబు తన హయాంలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు ఉన్న విషయాన్ని పక్కన పెడితే ఆయనకు ఉన్న విజన్ మరే సిఎంకు లేదన్న రీతిలో ప్రఖ్యాతి పొందారు. తమ అధినేత విజన్ కాంగ్రెసు నేతలకు ఎందుకు కనిపించలేదని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.
నరేంద్ర మోడీ కంటే ముందు దేశంలోకెల్ల అత్యంత విజన్ ఉన్న వ్యక్తిగా చంద్రబాబు విదేశీ నేతల ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేస్తున్నారు. అలాంటి వ్యక్తి పాలన ఫలాలను ఇన్నాళ్లు కాంగ్రెసు ప్రభుత్వం అనుభవించి, దోచేసి ఇప్పుడు రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందంటున్నారు. బాబు విజన్ కారణంగానే ఇన్నాళ్లు కాంగ్రెసు ప్రభుత్వం పథకాలను అమలు చేసిందని, ఎనిమిదేళ్లుగా పాలన సరిగా లేకపోవడంతో పథకాలు నిర్వీర్యమవుతున్నాయని వారు అంటున్నారు.












Click it and Unblock the Notifications