హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే: బాబుపై గండ్ర, అబద్దాలు హాబీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gandra Venkataramana Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆరోపిస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కు కావాల్సిన అవసరం తమకు లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి శుక్రవారం అన్నారు. ఉచిత విద్యుత్ పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుది రెండు నాల్కల ధోరణి అని విమర్శించారు. కుటుంబంలో తిరుగుబాటు వస్తుందన్న భయంతోనే ఆయన వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అది సిబిఐ, ఈడి వ్యవహారాలన్నారు. జగన్ కేసులో సిబిఐ, ఈడిలు కాంగ్రెసు చెప్పినట్లు నడుచుకుంటున్నాయన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని ప్రజా సమస్యలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అని మంత్రి సునితా లక్ష్మా రెడ్డి వేరుగా ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే ఆయన పాదయాత్ర చేపట్టారన్నారు.

చంద్రబాబుకు అబద్దాలు చెప్పటం తొలి నుండి అలవాటేనని మంత్రి శైలజానాథ్ అన్నారు. రైతులను అరెస్టు చేయించిన ఘనత చంద్రబాబు ఒక్కరిదే అని ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తానని బాబు చెబితే ప్రజలు ముఖ్యంగా రైతులు అసలే నమ్మరన్నారు. 2009లో కూడా చంద్రబాబు ఈ హామీ చేశారని శైలజానాథ్ గుర్తు చేశారు.

English summary
Government chief whip Gandra Venkataramana Reddy said on Friday that TDP chief Nara Chandrababu Naidu is doing padayatra(Vastunna Meekosam) by the fear of family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X