హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ బెయిల్‌పై జోరుగా బెట్టింగ్స్: ప్రార్థనలో విజయమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ టీవిలకు అతుక్కు పోయారు. తమ అధినేతకు ఈరోజు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జగన్ విడుదల కోసం రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, నేతలు పూజలు కూడా చేశారు.

మరోవైపు జగన్ బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతున్న ఈ సందర్భంలో కూడా జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయట. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వస్తాడని, రాడని వేలు, లక్షల్లో బెట్టింగులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగులకు బాగా పాల్పడుతున్నారట. కాగా గత వారం బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు కూడా ఇలాగే జోరుగా బెట్టింగులు జరిగిన విషయం తెలిసిందే.

గత శుక్రవారం సుప్రీం కోర్టులో జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పెై విచారణ ఉన్న నేపథ్యంలో బెయిల్‌పెై ఉత్కంఠ నెలకొంది. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో భేటీ అవడం చర్చనీయాంశమయింది. గతంలో కూడా ఓవైసీ జెైలులో ఉన్న జగన్‌ను కలిసిన తర్వాతే జగన్‌ పార్టీ రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు ప్రకటించింది.

ఢిల్లీలో మేకపాటి, సబ్బం హరి కాంగ్రెస్‌ నాయకత్వంలో చర్చలు కూడా జరిపారు. ఆ తర్వాత విజయమ్మ తనను కలసిన పార్టీ కార్యకర్తలతో 15 రోజుల్లో జగన్‌ బెయిల్‌పెై బయటకు వస్తారని చెప్పడం వివాదాస్పదమయింది. గత కొద్దిరోజుల క్రితం కూడా విజయమ్మ త్వరలో జగన్‌ బయటకు వస్తాడని భరోసా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కూడా జగన్‌ ఈనెల 28న నిర్దోషిగా బయటకు వస్తారని జోస్యం చెప్పారు.

ఇదిలా ఉండగా, శుక్రవారం జగన్‌కు కచ్చితంగా బెయిల్‌ వస్తుందన్న నమ్మకం ఆయన పార్టీలో కనిపిస్తోంది. చివరకు జగన్‌ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు సైతం 28న జగన్‌ బయటకు వస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారట. 28న సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు, విజయోత్సవాలు జరుపుకోవాలన్న సంకేతాలు కూడా వెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారం. కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, కదిరి, హైదరాబాద్‌ , మిర్యాలగూడ, తిరుపతి వంటి ప్రధాన పట్టణాల్లో జగన్‌ విడుదలవుతారని
వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు భారీ స్థాయిలో బెట్టింగులు కడుతున్నారట.

కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చర్చలు సఫలమయ్యాయని, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు తప్పకుండా బెయిల్ వస్తుందని భావించి భారీ మొత్తంలో బెట్టింగులు కడుతున్నారట. అంతేకాదు జగన్ జాతక రీత్యా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని ఉందట. ఇది కూడా భారీ బెట్టింగులకు అవకాశమిస్తోందని అంటున్నారు.

కాగా జగన్ ఇప్పటి వరకు 132 రోజులు జైళ్లో ఉన్నారు. అతనిని సిబిఐ మే 27న అరెస్టు చేసింది. జగన్ బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో జగన్ ఇంటి వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు గుమికూడారు. అక్కడ హడావుడి కనిపిస్తోంది. విజయమ్మ ప్రార్థనలో ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
It is said that Bettings are going in Andhra Pradesh on YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy's bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X