హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి జానారెడ్డిని కలిసిన కెసిఆర్ కూతురు కవిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavitha
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ఉదయం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానా రెడ్డిని కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైన బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించాలని తాము జానారెడ్డిని కోరామని చెప్పారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

వారు తీసుకోలేదు మేం తీసుకోలేదు.. కోదండ

తెలంగాణ ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడూ పరిగణలోకి తీసుకోలేదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ వేరుగా అన్నారు. అందుకే తాము కూడా ఆ కమిటీని ఎప్పుడూ పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. తెలంగాణ కవాతు సమయంలో ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని టిఎన్జీవో నేత విఠల్ డిమాండ్ చేశారు. లేదంటే తాము సమ్మె నోటీసులు ఇచ్చేందుకు సిద్దమన్నారు.

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల పునఃప్రతిష్ట

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల పునఃప్రతిష్టకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శుక్రవారం ఉదయం ధ్వంసమైన అన్నమయ్య, గురజాడ, వీరేశలింగం, కాటన్ విగ్రహాల ప్రతిష్ట చేయనుంది. అలాగే కొమరం భీమ్ విగ్రహం కూడా ట్యాంక్‌బండ్ ప్రతిష్టించనున్నారు. తెలంగాణ మిలియన్ మార్చ్ సందర్భంగా పలువురు ఆందోళనకారులు విగ్రహాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

English summary
Telangana Jagrithi president Kalvakuntla Kavitha has met Panchayathraj minister Jana Reddy on Friday morning about Bathukamma festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X