బెయిల్‌పై విచారణ నేడే: జగన్‌ను జైల్లో కల్సిన ఫ్యామిలీ

Sharmila - YS Vijayamma - YS Jagan
హైదరాబాద్: ఆస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన తల్లి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ శుక్రవారం ఉదయం జైలులో కలిశారు. విజయమ్మతో పాటు జగన్ సోదరి షర్మిల కూడా కలిసిన వారిలో ఉన్నారు. జగన్‌ను కుటుంబ సభ్యులు చాలా రోజుల తర్వాత జైలులో ఈ రోజు కలుసుకున్నారు.

మరోవైపు వైయస్ జగన్ బెయిల్ పిటిషన్ పైన విచారణ సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణ జరుగుతోంది. తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు జగన్‌కు తప్పకుండా బెయిల్ వస్తుందని విజయమ్మ, షర్మిళ, భారతిలతో సహా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోటి ఆశలతో ఎదురు చూస్తోంది. బెయిల్ విచారణ నేపథ్యంలో జగన్‌ను తల్లిస, సోదరి కలుసుకోవడం గమనార్హం.

అలీఖాన్‌ను కోర్టులో హాజరు పర్చిన సిబిఐ

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి పిఏ అలీ ఖాన్‌ను సిబిఐ శుక్రవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. అతనిని పిటి వారెంట్ పైన బెంగళూరు నుండి హైదరాబాదుకు తీసుకు వచ్చింది. గాలికి చెందిన ఓఎంసి కేసులో అలీ ఖాన్‌ను విచారించేందుకు అనుమతివ్వాలని సిబిఐ కోర్టును కోరనుంది.

ఎసిబి కోర్టులో గాలి

బెయిల్ ఫర్ క్యాష్ కేసులో ఎసిబి ఉదయం గాలి జనార్ధన్ రెడ్డి కోర్టులో హాజరుపరిచింది. ఇతనిని విచారించేందుకు అనుమతించాలని ఎసిబి కోర్టును కోరనుంది.

అక్బరుద్దీన్‌పై దాడి కేసులో పహిల్వాన్‌కు బెయిల్ రద్దు

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పైన దాడి కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం ఐదుగురి నిందితులకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. మరో ముగ్గురు నిందితులకు బెయిల్‌ను తిరస్కరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+