కావేరీ జలాల మంట: బెంగళూర్‌లో నిరసనల హోరు

Bangalore comes to a standstill, protesters hit streets
బెంగళూర్: కావేరీ ప్రకంపనలు కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో కనిపించాయి. బెంగళూర్‌లో శుక్రవారం సాధారణ జనజీవితం స్తంభించింది. ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ వివిధ కన్న సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళనకారులు వీధులకెక్కారు.

నగరంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. మధ్య, దక్షిణ బెంగళూర్‌ ప్రాంతాల్లో ఆందోళన ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు చోటు చేసుకోవడంతో కార్యాలయాలకు వెళ్లేవారు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

బెంగళూర్‌లో ఉదయం పదకొండున్నర గంటలకు నిరసన ర్యాలీలు ప్రారంభమయ్యాయి. సామాజిక కార్యకర్తలు, స్వాములు, నటులు వీధుల్లోకి వచ్చారు. తన అనుచరులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప భారీ ర్యాలీ నిర్వహించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు ర్యాలీల్లో పాల్గొన్నారు. జనతాదళ్ (ఎస్) నాయకులు కూడా ర్యాలీలు నిర్వహించారు. న్యాయవాదుల సంఘాలు కూడా నిరసనప్రదర్శనలకు మద్దతు తెలిపాయి.

కాగా, శనివారం రాష్ట్ర బంద్ తలపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక కృష్ణా రాజసాగర్, కబిని డ్యామ్‌ల నుంచి తమిళనాడుకు 9 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తోంది. దీన్ని నిరసిస్తూ కర్ణాటకలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. కావేరీ రివర్ అథారిటీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+