వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ వేధింపులు ఏ సిఎంకు లేవు: మోడీ, ప్రధానికి సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi
అహ్మదాబాద్: గుజరాత్ ఏర్పడి యాభై సంవత్సరాలు అవుతుందని, ఇప్పటి వరకు కేంద్రం నుండి అత్యధికంగా వేధింపులకు గురైన ముఖ్యమంత్రిని తానేనని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నరేంద్ర మోడీ మంగళవారం అన్నారు. నికోల్ ప్రాంతంలో మోడీ మాట్లాడారు. ధోల్కా నుండి మోడీ వికాస్ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. వికాస్ యాత్రలో భాగంగా మోడీ అహ్మదాబాద్‌లో మాట్లాడటం ఇదే తొలిసారి. అంతేకాదు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక బహిరంగ సభలో మాట్లాడటం కూడా ఇదే తొలిసారి.

కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఢిల్లీ సుల్తాన్స్‌తో పోల్చారు. కేంద్రం తనను వేధిస్తోందన్నారు. ఇప్పటి వరకు ఏ గుజరాత్ ముఖ్యమంత్రి కూడా ఇన్ని వేధింపులకు గురి కాలేదన్నారు. తాను పదకొండు ఏళ్లుగా కేంద్రం నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పారు. కేంద్రం తనను ఎంతగా వేధించినప్పటికీ గుజరాత్ ప్రజలు ప్రేమతో ఎదుర్కొంటున్నానని చెప్పారు. మోడీ తనను తాను సెక్యూరిటీ గార్డుగా పేర్కొన్నారు.

తాను పదకొండేళ్లుగా రాష్ట్రాన్ని రక్షిస్తున్నానని, దీనిని ముందు ముందు కూడా కొనసాగిస్తానని చెప్పారు. కేవలం తన పాలన వల్లనే గుజరాత్‌లో అవినీతి క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. ఈ పదకొండేళ్లలో గుజరాత్‌లో అవినీతి క్రమంగా తగ్గితే, కేంద్ర స్థాయిలో మాత్రం హెచ్చు మీరిందన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభివృద్ధి, ప్రాజెక్టుల విషయంలో తనతో పోటీ పడాలని సవాల్ విసిరారు.

కాంగ్రెసు ప్రభుత్వంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెసు పార్టీ ప్రజలను చీటింగ్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండి ఆ పార్టీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కాగా మన్మోహన్ సింగ్‌కు మోడీ సోమవారం కూడా తనతో పోటీ పడాలని సవాల్ విసిరారు.

English summary
Narendra Modi slam congress government, Sonia gandhi and PM in dholka. Addressing crowd in vikas yatra modi said people should aware from cheater congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X