విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ కథలు: షిండేవ్యాఖ్యపై లగడపాటి, ఎర్రబెల్లికూడా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal-Errabelli Dayakar Rao
విజయవాడ/హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత లగడపాటి రాజగోపాల్ కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలపై బుధవారం స్పందించారు. షిండే వ్యాఖ్యలను సమర్థించారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఏకాభిప్రాయం లేనప్పుడు అఖిలపక్షం ఎలా ఏర్పాటు చేస్తారని లగడపాటి అన్నారు.

కెసిఆర్‌ను తెలంగాణపై చర్చించేందుకు న్యూఢిల్లీకి ఎవరూ పిలవలేదన్నారు. ఆయన నెల రోజులు ఢిల్లీలో ఉండి తెలంగాణ ప్రజలకు చందమామ కథలు చెప్పి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏకాభిప్రాయం లేనప్పుడు ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయలేమన్న షిండే వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్నారు. కాగా రాష్ట్రం ఎప్పటికీ విడిపోదాని లగడపాటి రాజగోపాల్ చెబుతున్న విషయం తెలిసిందే.

నిజాన్ని గ్రహించండి.. ఎర్రబెల్లి

తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ నేత, టిటిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. అఖిలపక్షం, పార్టీలో ఏకాభిప్రాయం అంటూ కేంద్రం దాటవేత ధోరణిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్న వారు ఇప్పటికైనా నిజాన్ని గ్రహించాలని సూచించారు. కేంద్రమంత్రి షిండే వ్యాఖ్యలపై ఎర్రబెల్లి వేరుగా స్పందించారు.

English summary
Vijayawada MP Lagadapati Rajagopal has supported central home minister Sushil Kumar Shinde statement on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X