sharmila ys vijayamma ys jagan ysr congress hyderabad షర్మిల వైయస్ విజయమ్మ వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు హైదరాబాద్
షర్మిల 'మరో ప్రజా ప్రస్థానం': జగన్‌తో చర్చించాక తేది

షర్మిల పాదయాత్ర రెండు విడతలుగా ఉంటే బాగుంటుందని వారు సూచిస్తున్నట్లుగా సమాచారం. ఈ పాదయాత్రకు మరో ప్రజా ప్రస్థానం అని పేరు పెట్టి దసరా కంటే ముందే ప్రజల్లోకి వెళ్లాలని సీనియర్లు చెబుతున్నారట. ఇప్పటికే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టినందున షర్మిల కూడా పాదయాత్ర చేస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కాపీ కొట్టినట్లుగా ఎవరూ భావించరని వారు విజయమ్మకు చెబుతున్నారట.
ఇందుకు షర్మిల కూడా అంగీకారం తెలిపినట్లుగా సమాచారం. షర్మిల మహిళ కాబట్టి ఆమెకు కష్టం కాకుండా రెండు విడతలుగా ఈ యాత్రను చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ రోజు విజయమ్మ నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ, జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు భేటీ అయ్యారు. షర్మిల పాదయాత్రకే వారు మొగ్గు చూపుతున్నట్లుగా తెలిసినప్పటికీ భేటీ పూర్తయి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
షర్మిల మరో ప్రజా ప్రస్థానం యాత్ర కడప జిల్లాలోని ఇడుపులపాయ నుండి ప్రారంభమై శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుంది. 2003లో దివంగత వైయస్ తన పాదయాత్రను ముగించిన చోటే షర్మిల తన పాదయాత్రను ముగించనుంది. ఈ నెల 17 నుండి పాదయాత్ర చేపట్టాలని చూస్తున్నారు. అయితే జగన్‌తో చర్చించాక తేదీని ప్రకటించనున్నారు.