విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికల అఫిడవిట్‌లో కేసు: పార్థసారథికి కోర్టు సమన్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Parthasarathy
విజయవాడ: ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారమిచ్చారనే కేసులో మంత్రి పార్థసారథికి బుధవారం కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీ లోగా స్వయంగా తమ ఎదుట హాజరు కావాలని కోర్టు పార్థసారథికి జారీ చేసిన సమన్లలో ఆదేశించింది. పార్థసారథిపై ఐపిసి 177, 171జి, 125ఏ, 33ఏ, 195 సిఆర్‌పి సెక్షన్ల క్రింద కేసు నమోదయింది.

కాగా మంత్రి పార్థసారథిని ప్రాసిక్యూట్ చేయాలని విజయవాడ ఆర్డీవో మెజిస్ట్రీట్ కోర్టులో గత నెలలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రజాప్రాతినిథ్య చట్టం కింద ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆయనపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని, అందుకోసం అతనిని విచారించాల్సి ఉంటుందన్నారు.

మంత్రి పార్థసారథి ఎన్నికల కమిషన్ వద్ద తన పైన కేసు ఉన్న విషయాన్ని దాచి పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. 2009 ఎన్నికలలో పార్థసారథి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై అతి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన తన అఫిడవిట్‌లో పార్థసారథి తనపై కేసులు లేవని పేర్కొన్నారు. అఫిడవిట్ సమర్పించినప్పుడు కేసులు ఉంటే తప్పకుండా పేర్కొనవలసి ఉంది. కానీ పార్థసారథి మాత్రం ఈ విషయాన్ని పేర్కోలేదు.

కేసు నమోదై ఇప్పుడు నేరం రుజువైంది కనుక(రెండో నిందితుడు) పార్థసారథిపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో కేసు విషయమై ప్రస్తావించక పోవడం ద్వారా ఆయన మరిన్ని చిక్కుల్లో పడ్డారని అప్పుడే వార్తలొచ్చాయి. ఈ విషయమపై ఆయన చేతిలో ఓడిపోయిన అభ్యర్థి కూడా కోర్టుకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.ప్రజాప్రాతినిథ్యం చట్టం 1951 ప్రకారం ఆయనపై అనర్హత వేటుకు అవకాశముందని అంటున్నారు.

ఈ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే ఆయన ఆరేళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడవుతాడని చెబుతున్నారు. పార్థసారథి ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా ఆర్థిక నేరాల కోర్టు గతంలో నిర్ధారించిన విషయం తెలిసిందే. కెపిఆర్ టెలీ ప్రోడక్ట్స్ కంపెనీ పేరుతో మిషనరీ కొన్న పార్థసారథి ఫెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను కోర్టు అతనికి రూ.5లక్షల 15వేల జరిమానాతో పాటు రెండు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది.

English summary
Vijayawada majistret court has issued summons to minister Parthasarathi on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X