ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేఖ రాసే ధైర్యం ఉందా?: చంద్రబాబుకు కిరణ్ సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ఒంగోలు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబుకు ధైర్యముంటే ఐఎంజి వ్యవహారంలో తనను విచారించాలని స్వయంగా లేఖ రాయాలన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) విచారణ అంటే బాబుకు అంతగా భయమెందుకో చెప్పాలన్నారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

ప్రకాశం జిల్లాలో ఇందిర బాట కార్యక్రమంలో ఉన్న ముఖ్యమంత్రి జాతీయ ఛానెల్ ఎన్డీటీవితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బాబు స్వయంగా తనను విచారించాలని లేఖ రాయాలని సవాల్ విసిరారు. తాను కోర్టులో ఉన్న కేసుల గురించి ఏమీ మాట్లాడలేదన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి అనుమతి రాగానే మంత్రివర్గ విస్తరణగాని, మార్పులు చేర్పులు గానీ ఉంటాయని ఆయన చెప్పారు.

చంద్రబాబు ఓ చెల్లని కాసు అన్నారు. ఆయన చెప్పే మాటలు ప్రజలు ఎవరూ విశ్వసించడం లేదన్నారు. ఆయన పాదయాత్ర కాదు.. చేతులపై యాత్ర చేసినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణపై తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయనన్నారు. అది సున్నితమైన అంశమని చెప్పారు. తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. త్వరలో కేంద్రం దీనిని పరిష్కరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
CM Kiran Kumar Reddy challenged Telugudesam Party chief Nara Chandrababu Naidu on Wednesday. He said he will not comment on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X