హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలోకి మాజీ ముఖ్యమంత్రి తనయుడు జలగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress
హైదరాబాద్: తాను త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు జలగం వెంకట్రావు గురువారం చెప్పారు. ఆయన ఈ రోజు మధ్యాహ్నం అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తాను త్వరలో జగన్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో తనకు ఉన్న సత్సంబంధాల వల్లే తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. వైయస్ తన హయాంలో పేద ప్రజల కోసం పలు పథకాలు ప్రవేశ పెట్టారని చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసమే ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించారని, ఆయన పార్టీలో చేరి వైయస్ ఆశయాల కోసం పని చేస్తామన్నారు.

కాగా ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి మరోసారి వలసలు జోరుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సీమాంధ్ర ప్రాంతం నుండి ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు జగన్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైపోయారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన వారు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆయన వ్యూహాలు సరిగా లేవని మండిపడ్డారు. వారు తెలంగాణ లేఖ చూపించి బాబును విమర్శించడం జగన్ పార్టీకి జై కొట్టేందుకే.

ఇప్పుడు తెలంగాణ ప్రాంతం నుండి కూడా వలసలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లాలో జలగం కుటుంబ సభ్యులకు మంచి బలం ఉంది. జలగం వెంకళ రావుకు ఇద్దరు తనయులు. ఒకరు వెంకట్రావు కాగా మరొకరు ప్రసాద రావు. ప్రసాద రావు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు. వెంకట్రావు మాత్రం తాను జగన్ పార్టీలో చేరతానని ప్రకటించారు.

English summary
Former chief minister Jalagam Vengal Rao's son Jalagam Venkat Rao said on Thursday that he will join in YSR Congress party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X