భర్త వద్దని, ప్రియుడితోనే వెళ్తానని కోర్టులో చెప్పిన భార్య

ఆ తర్వాత ఆగస్టులో ఆమె మాయమైంది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెదికినా కనిపించలేదు. దీంతో భర్త ఆదంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐజాక్‌తో ఉన్న ఫాతిమాభానును అదుపులోకి తీసుకుని భర్తకు అప్పగించారు. కొన్ని రోజుల తర్వాత ఆమె మళ్లీ కనిపించకుండా పోయింది. ఎక్కడ వెదికినా కనిపించక పోవడంతో మహమ్మద్ ఇస్మాయిల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
అనంతరం న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు ఆదంబాక్కం పోలీసులు ఫాతిమాభాను కోసం వెతగ్గా రాయపురంలో దొరికింది. ఫాతిమాభానును సోమవారం సాయంత్రం న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఫాతిమాభానును విచారించారు. భర్త వెంట వెళ్లడానికి విముఖత వ్యక్తం చేసింది. ప్రియుడు ఐజాక్‌తోనే వెళతానని చెప్పింది. దీన్ని ఆమోదించని న్యాయస్థానం ఫాతిమాభానును తల్లిదండ్రుల వెంట పంపడానికి అనుమతించింది.












Click it and Unblock the Notifications