కోర్టు తీర్పుపైవ్యాఖ్య: కెటిఆర్‌పై సుమోటో కేసు నమోదు

కోర్టు ఇచ్చిన తీర్పు పైన ఆయన చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 30వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అతనికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు కెటిఆర్‌కు అందినట్లుగా కూడా తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.
కాగా స్వామి గౌడ్ టిఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టిఎన్జీవో హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అవకతవకలు ప్రభుత్వ విచారణలో నిర్ధారణ అయింది. దీంతో స్వామి గౌడ్, ఇతర బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications