వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతుక్కుని తిరిగితే రేప్‌లు జరగవా: దీదీ భాష్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee
కోల్‌కత్తా‌: పెరిగిపోతున్న అత్యాచారాల సంఘటనలకు తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన భాష్యం చెప్పారు. అత్యాచారాలు పెరిగిపోవడానికి ఆడామగా రాసుకునిపూసుకుని తిరగడమే కారణమని ఆమె అన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మమతా బెనర్డీ తమ పార్టీ పత్రిక జాగో బంగ్లా ప్రత్యేక సంచికను ఆవిష్కరించి ప్రసంగించారు.

తన ప్రసంగంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించి, తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు స్త్రీపురుషులు అతుక్కుపోయి తిరుగుతున్నారని, ఎటు చూసినా ఇలాగే కనిపిస్తోందని ఆమె అన్నారు. స్త్రీపురుషులు చేతిలో చేయి వేసుకుని నడిస్తే పెద్దలు మందలించేవారని, ఓపెన్ ఆప్షన్ ఉన్న ఓపెన్ మార్కెట్‌ లాగా అంతా బహిరంగంగానే జరిగిపోతోందని ఆమె అన్నారు.

అదే సమయంలో ఆమె మీడియాపై తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. మీడియాలో ఓ వర్గం నిజాలు రాయకుండా, వాటిని దాచిపెట్టి వార్తా కాలుష్యం సృష్టిస్తోందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో అక్కడడక్కడ జరుగుతున్న సంఘటనలను ప్రోది చేసి రాష్ట్రమంతా అత్యాచారాలమయం అయినట్లుగా కొన్ని మీడియా సంస్థలు చూపిస్తున్నాయని ఆమె విమర్సించారు. దీన్ని ప్రజలు సహించబోరని ఆమె హెచ్చరించారు.

మహిళల ఒప్పుకోలు వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని హర్యానా పిసిసి ప్రతినిధి ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెసు శాసనసభ్యుడు మరో ప్రకటన చేశారు. సామాజిక, మానసిక పురోగతి లేకపోవడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని కాంగ్రెసు శాసనసభ్యుడు సంపత్ సింగ్ వ్యాఖ్యానించారు.

English summary
West Bengal CM and Trinamool Congress president Mamata Banerjee made a sensational comments on rapes. She said that due to the closeness of men and women they are occuring.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X