బాబు యాత్ర: టిజెఏసి, టిడిపి మధ్య ఘర్షణ, గాయాలు

చంద్రబాబు నాయుడు యాత్రపై మల్దకల్ తెలుగుదేశం పార్టీ నేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో జెఏసి నేతలు తాము చంద్రబాబు యాత్రను అడ్డుకుంటామని చెప్పేందుకు సమావేశం జరుగుతున్న ప్రాంతం వద్దకు వచ్చారు. చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మను జెఏసి దగ్ధం చేసింది.
దీనిని గమనించిన టిడిపి ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి దానిని అడ్డుకున్నారు. దీంతో జెఏసి నేతలు చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణపై టిడిపి స్పష్టమైన వైఖరి ప్రకటించని పక్షంలో తాము బాబు యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.
అనంతరం అది కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. టిడిపి, జెఏసి నేతలు ఒకరిపై మరొకరు దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురుకి స్వల్ప గాయాలయ్యాయి. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీంతో పరిస్థితి చల్లబడింది. పోలీసుల జోక్యంతో ఇరువర్గాలు శాంతించాయి.












Click it and Unblock the Notifications