పాదయాత్ర పేటెంట్ మాదే, బాబు కాపీ: జగన్ పార్టీ

YSR Congress
చిత్తూరు: పాదయాత్ర దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పేటెంట్ హక్కు అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైవి సుబ్బా రెడ్డి బుధవారం అన్నారు. ఆయన తిరుచానూరులో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నెల రోజుల క్రితమే పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారని ఆయన చెప్పారు.

అయితే ఇటీవల సుప్రీం కోర్టులో బెయిల్ రాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆయన సోదరి షర్మిల పాదయాత్ర చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. పాదయాత్ర మా పార్టీ పేటెంట్ హక్కు అన్నారు. తమ పాదయాత్రనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాపీ కొట్టారని విమర్శించారు. ప్రజల కడగండ్లు తుడవడానికే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

షర్మిల పాదయాత్ర సజావుగా సాగాలని ఆ దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. షర్మిల పాదయాత్రలు రాష్ట్ర ప్రజల అందరి మద్దతు ఉందన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల వైఖరికి నిరసనగానే ఆమె పాదయాత్ర చేస్తున్నారన్నారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకొని వాటిపై షర్మిల దృష్టి సారిస్తారన్నారు.

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సత్యం శ్రీరంగం బుధవారం చేరారు. పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీరంగం తన అనుచరులతో కలిసి జగన్ పార్టీలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+