కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు యాత్ర: పవన్ కళ్యాణ్ '...రాంబాబు' ఫ్లెక్సీల దగ్ధం

By Pratap
|
Google Oneindia TeluguNews

Cameraman Ganga Tho Rambabu
కర్నూలు/ ఒంగోలు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కెమెరామేన్‌ గంగతో రాంబాబు సినిమా రాజకీయ రంగు పులుముకుంటోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సినిమాపై నిప్పులు చెరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో పవన్ కళ్యాణ్ సినిమాపై పార్టీ కార్యకర్తలు తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు.

పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను, కెమెరామేన్ గంగతో రాంబాబు పోస్టర్లను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చించేసి, వాటిని దగ్ధం చేశారు. తమ నాయకుడు చంద్రబాబు పాదయాత్రపై సినిమాలో సెటైర్లు ఉన్నాయని, ఉద్దేశ్యపూర్వకంగానే అందులో ఆ సంభాషణలు పెట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలోని పాత్రల పేర్లు కూడా చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను పోలి ఉన్నాయని వారన్నారు. సినిమాలోని సెటైర్లను తొలగించకపోతే కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.

ఇదిలా వుంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ప్రదర్శనను ప్రకాశం జిల్లా చీరాలలోని మోహన్ థియేటర్లో నిలిపి వేసారు. రెవెన్యూ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా...సినిమా టిక్కెట్లు అధిక ధరకు అమ్ముకున్నారనే కారణంతో అధికారులు ఈ చిత్రాన్ని ఇక్కడ నిలిపి వేసినట్లు తెలుస్తోంది. థియేటర్‌ను సీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పాత్రల పేర్లు జవహర్ నాయుడు, రానా బాబు వంటివి ఉండడం పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమా గురువారం విడుదలైన విషయం తెలిసిందే. సినిమాలో సెటైర్లు దండిగా ఉన్నాయి. రాజకీయాలపైనే ఈ సెటైర్లను గురి పెట్టినట్లు అర్థమవుతోంది.

English summary
Telugudesam worker are expressing anguish at Pawan Kalyan's cameraman Gangatho Rambabu film. During TDP president Chandrababu Naidu's padayatra in Kurnool district, party activists have burnt Pawan Kalyan's flexis and posters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X