షర్మిల పాదయాత్ర కుట్రను ఛేదిస్తుంది: వైయస్ వివేకా

అధికార కాంగ్రెసు పార్టీ, విపక్ష తెలుగుదేశం పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల అండ మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకే ఉందన్నారు. అధికార, విపక్షాల కుట్రను ఛేదించడానికే మరో ప్రజా ప్రస్థానం మొదలైందన్నారు. కులాలు, మతాలకు అతీతంగా ప్రజలు పాదయాత్రకు మద్దతు పలుకుతున్నారని వైయస్ వివేకానంద రెడ్డి చెప్పారు. పాదయాత్ర తప్పకుండా విజయవంతమవుతుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
తండ్రికి తగ్గ తనయురాలిగా షర్మిల నడుచుకుంటారని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సోదరి విమలమ్మ అన్నారు. ఇడుపులపాయలోని వైయస్ సమాధి వద్ద ఆమె నివాళులు అర్పిచారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. షర్మిల పాదయాత్ర సాహసోపేతమైందని అన్నారు. షర్మిల పాదయాత్ర సంపూర్ణంగా విజయవంతమవుతుందని అన్నారు. వైయస్ మాదిరిగానే వారి బిడ్డలకు కూడా ప్రజల ప్రేమ, అభిమానం, అండదండలుంటాయని ఆమె అన్నారు.
మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ముందు జరిగిన బహిరంగ సభలో షర్మిల పాల్గొన్నారు. అంతకు ముందు ఆమె వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైయస్ ఘాట్ వద్ద తల్లి వైయస్ విజయమ్మ, వదిన వైయస్ భారతిలతో కలిసి ఆమె తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, అభిమానులు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications