హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు యాత్రకు తెలంగాణ సెగ: చలో రాజోలీకి పిలుపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు తెలంగాణ సెగ తగులనుంది. చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 22వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశించి, తెలంగాణ ప్రాంతంలో ప్రారంభమవుతుంది. అదే రోజు తెలంగాణ జెఎసి చలో రాజోలీకి పిలుపునిచ్చింది. దీంతో చంద్రబాబు పాదయాత్రకు తొలి రోజు నుంచే తెలంగాణ సెగ తాకనుంది. ఈ నెల 22వ తేదీన చలో రాజోలీకి తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు.

చంద్రబాబు పాదయాత్రకు నిరసనలు, నిలదీతలు తప్పవని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌కు చంద్రబాబు రాసిన లేఖ మరింత గందరగోళంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలని కోదండరామ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎటువైపు ఉంటుందో తెలుగుదేశం పార్టీ తేల్చుకోవాలని అన్నారు.

చంద్రబాబు తెలంగాణలో కాలు మోపడం అంటే బలిచక్రవర్తిపై వామనుడు పాదం మోపడమేనని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే నిరసనలు తప్పవని అన్నారు. 2009 ఎన్నికల హామీకి కట్టుబడి ఉందో, లేదో తెలుగుదేశం పార్టీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి పెద్ద యెత్తున తరలి రావాలని ఆయన తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు.

కాగా, తెలంగాణపై చంద్రబాబుకు స్పష్టత లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు వినోద్ కుమార్ అన్నారు. చంద్రబాబుపై తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రను అడ్డుకోవద్దని తెలంగాణ జెఎసిని కోరుతామని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాలో చంద్రబాబును, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఉన్న సన్నివేశాలను తొలగించాలని ఆయన శనివారం డిమాండ్ చేశారు.

English summary
Telangana JAC has decided tp obstruct Telugudesam president N Chandrababu Naidu's padayatra in Telangana region. Telangana JAC chairman Kodandaram has given a call for Chalo Rajoli on october 22, on which Chandrababu's padayatra enters in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X