షర్మిల యాత్ర ముఖ్యమంత్రి పదవికోసం కాదు: అంబటి

Ambati Rambabu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠం కోసమే పాదయాత్ర చేస్తున్నారని, కానీ తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మాత్రం ముఖ్యమంత్రి పదవి కోసం యాత్ర చేయడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సోమవారం అన్నారు. ఆయన హైదరాబాదులోని పార్టీ సెంట్రల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి కావాలన్నదే బాబు ఆశయమన్నారు. బాబు కాళ్లకు కాకుండా మెదడుకు ఆపరేషన్ చేయాలన్నారు. చంద్రబాబు డబ్బులు ఇచ్చి టీవీలలో కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరన్నారు. షర్మిల మాత్రం సిఎం పదవి కోసం పాదయాత్ర చేయడం లేదన్నారు. ఆ పదవి కోసమే అయితే మాకు యాత్రే అవసరం లేదన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే షర్మిల ఈ యాత్ర చేస్తున్నారన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఏ వాగ్దానాలు అయితే చేశారో వాటిని ఈ ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు లాలూచీని, వైయస్ వాగ్దానాలను నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగానే తాము పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. రెండు పార్టీల కుట్రను తాము ప్రజల్లోకి తీసుకు వెళ్తామని చెప్పారు. జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బాబు, కాంగ్రెసు కుట్ర చేస్తున్నాయన్నారు.

తాము తెలంగాణపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశామని అంబటి రాంబాబు అన్నారు. తమ పార్టీ అధినేత సోదరి షర్మిల పాదయాత్రను తెలంగాణవాదులు అడ్డుకోరని తాను భావిస్తున్నానని చెప్పారు. కేంద్రం తెలంగాణ ఇస్తే తాము వ్యతిరేకం కాదని ఇప్పటికే చెప్పామన్నారు.

నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని.. గొల్ల బాబూరావు

టిడిపి నేతలు తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బైబిల్ పట్టుకోవడాన్ని రాజకీయం చేయడం తగదని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు విశాఖపట్నంలో అన్నారు. తనకు శ్రీ వేంకటేశ్వర స్వామి అంటే భక్తి అని, ఆయన ఫోటోను తాను జేబులో పెట్టుకుంటానని, అంతమాత్రాన మత ప్రచారం చేస్తున్నట్టా అని బాబురావు సూటిగా ప్రశ్నించారు. రాజకీయంగా ప్రజలకు దూరం అవుతామనే భయంతోనే టిడిపి ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+