బాబు ఎంతకైనా తెగిస్తాడు, రెండు ధ్యేయాలు: షర్మిల

ఒకటి మొద్దు నిద్ర నటిస్తున్న కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని నిద్రలేపటం, రెండు మొద్దు నిద్రపోతున్న ప్రతిపక్ష పార్టీని ఎండగట్టడం అన్నారు. ఈ రెండు ధ్యేయాలతోనే తాను యాత్ర చేస్తున్నానని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కిరణ్ కుమార్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. సిబిఐ నుండి తప్పించుకునేందుకే ఆయన అవిశ్వాసం పెట్టడటం లేదని విమర్శించారు.
చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరుతో చేస్తున్న పాదయాత్ర ప్రజల కోసం కాదని, తాను అధికారంలోకి వచ్చేందుకే అన్నారు. తన తండ్రి, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ తాను ప్రజల కోసమే ప్రజా జీవితంలోకి వచ్చానని చెప్పారు. అందుకోసమే ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించానని చెప్పారు.
ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారానే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి అన్నారు. టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. వైయస్ ప్రభంజనాన్ని అడ్డుకట్ట వేయాలని జగన్‌ను జైలుకు పంపించారన్నారు. అందుకే షర్మిల పాదయాత్ర చారిత్రక అవసరంగా మారిందని అన్నారు.












Click it and Unblock the Notifications