వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్ల్స్‌కు మొబైల్స్ ఇవ్వకండి: బిఎస్పీ ఎంపి వివాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Don't give mobile phone to Girls
ముజఫర్‌నగర్: అమ్మాయిలకు మొబైల్ ఫోన్లు ఇవ్వద్దని వ్యాఖ్యానిస్తూ బిఎస్పీ పార్లమెంటు సభ్యుడు వివాదానికి తెర తీశారు. పిల్లలకు, ముఖ్యంగా అమ్మాయిలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని, తన ప్రసంగాల్లో ప్రతిసారీ ఈ విషయం చెబుతున్నానని, పిల్లల వద్ద మొబైల్ ఫోన్లు ఉంటే వెనక్కి తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు రాజ్‌పాల్ సింగ్ సైనీ అన్నారు.

"మొబైల్స్ లేకపోతే వారు ఏం కోల్పోతున్నారు, మొబైల్స్ లేకపోతే అమ్మాయిలు ఏం పోగొట్టుకుంటున్నారు?" అని ఆయన అడిగారు. మొబైల్స్ లేకపోతే వారేమైనా చచ్చిపోతారా అని ఆయన ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆదివారం రాత్రి ఆయన ఆ విధంగా అన్నారు.

తన కూతురు పారిపోయిందంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో సైనీ ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. తన కూతురు పారిపోవడానికి మొబైల్ ఫోన్ ఉపయోగపడిందని కూడా ఆ వ్యక్తి పార్లమెంటు సభ్యుడికి చెప్పినట్లు సమాచారం.

కొన్ని నెలల క్రితం భాఘ్పట్ పంచాయతీ ప్రేమ వివాహాలను నిషేధించింది. దానికి తోడు, మహిళలు షాపింగ్‌కు వెళ్లకూడదని, ఇంటి బయట సెల్ ఫోన్లు వాడకూడదని నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే సైనీ అమ్మాయిలకు మొబైల్స్ ఇవ్వకూడదని సూచించినట్లు చెబుతున్నారు.

English summary
A BSP MP has kicked off a controversy by saying that girls should not be given mobile phones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X