నో టాయ్‌లెట్ నో వధువు: జైరాం రమేష్ నినాదం

పెళ్లి చేసుకునే ముందు రాహువు, కేతువుల స్థితిగతులు తెలుసుకునేందుకు జ్యోతిష్యుడిని సంప్రదిస్తారని, అలాగే వరుడి ఇంట్లో మరుగుదొడ్డి ఉందో లేదో చూసుకున్న తర్వాతే వివాహంపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. పదేళ్లలో బహిరంగ మల విసర్జనను నిర్మూలించాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రజా ఉద్యమమే నిర్మల్ భారత్ అభియాన్ అని మంత్రి చెప్పారు. రాజస్థాన్ ప్రభుత్వం ప్రజలకు సరైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు.
బహిరంగ ప్రదేశంలో మల విసర్జన చేసేవారిని అరెస్టు చేయాలని ఆయన అన్నారు. ప్రతి రోజూ రైళ్లలో రెండు కోట్ల మంది ప్రయాణిస్తారని, 50 వేల కోచ్‌లు ట్రాక్‌లపై నడుస్తాయని, ప్రతి కోచ్‌లో నాలుగు టాయ్‌లెట్లు ఉంటాయని, ఎవరైనా బయట మల విసర్జన చేస్తే శిక్షించాల్సిందేనని అన్నారు.
గ్రామాల్లో దేవాలయాలు అవసరం లేదని, మరుగుదొడ్లు ఉండాలని అంతకు ముందు జైరాం రమేష్ అన్నారు. దాంతో వివాదం చెలరేగింది. జైరాం రమేష్ హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని బిజెపి విమర్శించింది.












Click it and Unblock the Notifications