వన్ ఇండియాకు డెలాయిట్ టెక్నాలజీ అవార్డు

వన్ ఇండియా డాట్ ఇండియాను గ్రేనియం సంస్థ నడిపిస్తోంది. గ్రేనియం క్లిక్ డాట్ ఇన్‌తో పాటు వివిధ వర్టికల్స్ ఉన్నాయి. వన్ ఇండియా నుంచి దక్షిణాది భాషలు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా పోర్టల్స్ వెలువడుతున్నాయి. గుజరాతీ, హిందీ భాషల్లో కూడా వన్ ఇండియా ఉంది.
గత మూడేళ్ల రెవెన్యూ పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని అవార్డును ప్రకటించినట్లు డెలాయిట్ తెలిపింది. మొత్తం 50 విజేతల్లో తొమ్మిది ఇంటర్నెట్ కెటగిరీకి చెందినవి. వన్ ఇండియా మంచి పెరుగుదలను చూపిస్తోందని, భారతీయ భాషలన్నింటితో కలిపి దాన్ని గుర్తింపు లభించిందని వన్ ఇండియా డాట్ కామ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ బిజి మహేష్ అన్నారు.
తాము ప్రారంభించిన భారతీయ భాషల పోర్టల్స్‌లో గుజరాతీ అని, దాన్ని ఇటీవలే ప్రారంభించామని ఆయన అన్నారు. ఇది గ్రేనియమ్ జట్టుకు ఆహ్వానించదగిన పరిణామమని, అయితే మిగతా 49ని చూస్తే ఇంకా చాలా సాధించాల్సి ఉందని అనిపిస్తుందని ఆయన అన్నారు. ఇతరులు సాధించినప్పుడు తాము కూడా సాధించగలమని అన్నారు.
మరింత ఉన్నత స్థాయి ఆకాంక్షలతో పనిచేయాలని ముఖ్య అతిథి ఫనీష్ మూర్తి విన్నింగ్ టీమ్స్‌కు సూచించారు. ఉన్నతమైన ఆలోచనల ద్వారానే ఉన్నతమైన లక్ష్యాలను సాధించగలమని అన్నారు. భాగస్వాములను జాగ్రత్తగా, తెలివిగా ఎంచుకోవాలని సూచించారు.
రీచార్జ్ఐటి డాట్ కామ్, కుకూబ్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రెడ్‌బస్, పే పాయింట్, కాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్, ఇండియా ఐడియాస్ డాట్ కామ్ (బిల్‌డెస్క్), వైల్డ్‌నెట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మాట్రిమోనీ డాట్ కామ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా అవార్దులు సాధించాయి.












Click it and Unblock the Notifications