నిత్య పెళ్లిళ్లు కూతురు అరెస్టు, దోపిడీలకే వివాహాలు

కిషోర్‌బాబు చెప్పిన వివరాలు ప్రకారం - పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతానికి చెందిన బండారు లత (22) వత్సవాయి మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డిని ఈ ఏడాది జూన్ 12వ తేదీన వివాహం చేసుకుంది. 16 రోజుల పండుగ అనంతరం ఆ అమ్మాయికి పెట్టిన బంగారు నగలతో ఉడాయించింది. దీంతో భర్త సత్యనారాయణరెడ్డి, ఆడపడుచు రుక్మిణి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ మురళీకృష్ణ తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేసి శుక్రవారం ఆమెను జగ్గయ్యపేటలో అరెస్టు చేశారు.
కాగా బండారు లత మూడేళ్ల క్రితం పాలకొల్లులో ఉంటున్న హైదరాబాదుకు చెందిన వ్యక్తి నర్సింహరాజును, ఆ తరువాత అదే పాలకొల్లుకు చెందిన మీసాల నాగరాజును వివాహం చేసుకొని పారిపోయినట్లు గుర్తించారు. ఆమె తీసుకువెళ్లిన 6 తులాల బంగారు అభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో నాగరాజుతో కలిసి లత పలు దొంగతనాలకు కూడా పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని, దొంగిలించిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఆ నగలు, నగదు అయిపోవడంతో మళ్లీ నమ్మకంగా ఉంటూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications