దుకాణాలు క్లోజ్ అవుతాయనే: షర్మిల, వెంటే విజయమ్మ

Sharmila
అనంతపురం: తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఎక్కడ తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందనే ఆందోళనతోనే కుమ్మక్కు అయ్యాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల శనివారం అనంతపురం జిల్లా తన మరో ప్రజా ప్రస్థానం యాత్ర సందర్భంగా వ్యాఖ్యానించారు. జ్వరంతో బాధపడుతున్న షర్మిల శనివారం తన యాత్రను కుదించుకున్న విషయం తెలిసిందే. పదోరోజు ఆమె జ్వరం కారణంగా ఉదయం, సాయంత్రం కొద్దిసేపు పాదయాత్ర చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జగన్‌కు ప్రజలు పట్టం గడుతున్నారని, 2014 వరకు ఎక్కడ తమ పార్టీలు ఉండకుండా పోతాయో అన్న ఉద్దేశ్యంతోనే కాంగ్రెసు, టిడిపిలు కుట్ర పన్ని జగన్‌ను జైలుకు పంపాయని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు త్వరలో బుద్ది వచ్చే రోజు వస్తుందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రైతులు తలెత్తుకొని జీవించగలుగుతారని, ఈ ప్రభుత్వం ఎవరి సమస్యలను పరిష్కరించడం లేదని మండిపడ్డారు.

కాంగ్రెసు, చంద్రబాబులు చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయన్నారు. చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని, అందువల్లనే ఆయన అవినీతిపై ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదన్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెందినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు కష్టాలు వచ్చాయన్నారు. బాబు పాదయాత్ర పేరుతో హైడ్రామా సాగిస్తున్నాడని విమర్శించారు.

కాగా శుక్రవారం రోజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ధర్మవరం వచ్చిన విషయం తెలిసిందే. కూతురు జ్వరంతో బాధపడుతుండటంతో ఆమె శనివారం కూడా షర్మిల వెంటే ఉన్నారు. ఆమె ప్రత్యేక బస్సులో ఉంటూ కుమార్తె యోగక్షేమాలు తెలుసుకుంటూ గడిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+