బాబు బాట సజావుగా..: డికెఅరుణ, కల్సిన సమరసింహ

DK Aruna
మహబూబ్‌నగర్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర సజావుగా సాగాలని మంత్రి డికె అరుణ ఆదివారం అన్నారు. అదే సమయంలో ఆమె చంద్రబాబు పాదయాత్ర పైన విమర్శలు చేశారు. ఎవరో ఇచ్చిన సమాచారం ఆధారంగా చంద్రబాబు నాయుడు ఆర్డీఎస్ పైన విమర్శలు చేయడం సరికాదని ఆమె అన్నారు. జిల్లాను దత్తత తీసుకున్నట్లుగా చెప్పిన బాబు పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు.

చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర ప్రజల కోసం కాదని, ఆయన పదవి కోసమే అన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి ముఖ్యమంత్రి కావడానికే ఆయన యాత్ర చేస్తున్నారన్నారు. బాబు హయాంలోనే ఆర్డీఎస్ తూములను రాయలసీమ నేతలు విధ్వంసం చేశారని గుర్తు చేశారు.

ఆర్డీఎస్ పైకి దండయాత్రలా వచ్చారని మండిపడ్డారు. బాబు ఆర్డీఎస్ పైన మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. టిడిపి హయాంలోనే ధ్వంసమైనప్పటికీ నేతలు జిల్లా ప్రజలపై ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తన యాత్రను పదవి కోసం కాకుండా ప్రజల గురించి చేస్తే మంచిదని ఆమె హితవు పలికారు.

రాజకీయ చర్చ జరగలేదు

తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలవడానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని డికె సమరసింహా రెడ్డి అన్నారు. తన కలయికలో ఎలాంటి రాజకీయ దృక్పథం లేదని, మానవా దృక్పథంతో ఆయనకు గాయాలు అయినందున పరామర్శించానని చెప్పారు. మంచి ఉద్దేశ్యంతో చేపట్టిన బాబు యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత మురళీ మోహన్ కూడా చంద్రబాబును పరామర్శించారు. ప్రస్తుతం రాష్ట్రం పూర్తిగా సంక్షోభంలో ఉందని, అవినీతిలో కూరుకుపోయిందని, సమర్థ పాలన రావాలంటే చంద్రబాబు పాలన రావాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+