పెదనాన్నకు ఆత్మవిశ్వాసం ఎక్కువ: హీరో నారా రోహిత్

అంతకుముందు హీరో జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించిన విషయం తెలిసిందే. అంతకుముందు రోజు చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలియగానే ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్ హైదరాబాదు నుండి మహబూబ్‌నగర్ చేరుకున్నారు. వారిద్దరు హుటాహుటినా గద్వాలకు చేరుకున్నారు. అక్కడే ఉన్నారు. శుక్రవారం రాత్రి వేదిక కూలిందని తెలియగానే చంద్రబాబుకు పరామర్శల వెల్లువ ప్రారంభమైంది.
శుక్రవారం హీరోలు నారా రోహిత్, జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి, బాలకృష్ణ భార్య వసుంధర, చంద్రబాబు సోదరిమణులు రాజేశ్వరి, హైమావతి, నందమూరి రామకృష్ణ సతీమణి జయశ్రీ తదితరులు చంద్రబాబు నాయుడును పరామర్శించిన వారిలో ఉన్నారు. భువనేశ్వరి, లోకేష్ దగ్గరుండి బాబును చూసుకుంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుండి బాబు తిరిగి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications