వివాదం తెలియదు, తెలంగాణపై చెప్పా: జైపాల్ రెడ్డి

తెలంగాణపై తన అభిప్రాయాన్ని ఇప్పటికే కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ అంశానికి, తన శాఖ మార్పునకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు. నిజాయితీ ఉన్న వ్యక్తిని ఏ శక్తులూ ఏమీ చేయలేవని ఆయన అన్నారు. తనకు దేశప్రగతికి ఉపయోగపడే శాఖ ఇచ్చారని ఆయన అన్నారు.
పెట్రోలియం శాఖ మంత్రిగా అయినప్పుడు సంతోషంగా లేనని, పోయినందుకు దుఖ్కంగా లేనని ఆయన అన్నారు నిజాయితీగల రాజకీయ నాయకుడికి దేనివల్ల కూడా నష్టం లేదని అన్నారు తనకు ఈ శాఖ కేటాయించినందుకు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విధేయుడైన పార్టీ కార్యకర్తగా నిజాయితీతో పనిచేస్తానని చెప్పారు. తనకు 8వేల మంది శాస్త్రవేత్తలతో పనిచేసే అవకాశం లభించిందని అన్నారు.
12వ పంచవర్ష ప్రణాళికలో శాస్త్ర, సాంకేతిక రంగానికి పెద్ద పీట వేశామని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో భారత్ పనితీరు సంతృప్తికరంగా ఉందని ఆయన చెప్పారు. తన శాఖ మార్పుపై జైపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రిలయన్స్‌తో వ్యవహరించిన తీరు వల్లనే శాఖ మారిందనే వార్తలు కూడా వచ్చాయి.
ఇదిలావుంటే, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెసు నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డికి ప్రజలతో సంబంధం లేని శాఖ కట్టబెట్టారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్తు సరఫరా వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆయన సోమవారం నల్లగొండలో అన్నారు.












Click it and Unblock the Notifications