హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫాంహౌస్ నుండి హైదరాబాద్‌కు కెసిఆర్: కలిసిన బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao - Botsa Satyanarayana
హైదరాబాద్: గత కొద్దిరోజులుగా మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని తన ఫాంహౌస్‌లో ఉంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం రాత్రి హైదరాబాదుకు వచ్చారు. ఆయనను ఫాంహౌస్‌లో పలువురు పార్టీ నేతలు, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నేతలు కలిసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కెసిఆర్ అక్కడే తదుపరి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ప్రణాళికలను అమలుపరిచేందుకే ఆయన బయటకు వచ్చారని అంటున్నారు.

కాగా హైదరాబాద్ వచ్చిన కెసిఆర్‌ను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం కలుసుకున్నారు. దాదాపు ఇరవై నిమిషాలు కెసిఆర్ నివాసంలో బొత్స ఉన్నారు. అయితే ఆయన రాకకు రాజకీయ ప్రాధాన్యం లేదని, వచ్చే నెల రెండవ తేదిన జరిగే తన కుమార్తె వివాహానికి కెసిఆర్‌ను ఆహ్వానించడానికే తెరాస అధినేత ఇంటికి వచ్చినట్లుగా చెబుతున్నారు.

బొత్స అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ వలసలు ఊహించినవే అని చెప్పిన విషయం తెలిసిందే. తన వల్లనే పార్లమెంటు సభ్యురాలైన తన భార్య బొత్స ఝాన్సీకి కేంద్ర మంత్రి పదవి రాలేదని చెప్పారు. తాను పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా ఉండడం వల్ల ఝాన్సీకి కేంద్ర మంత్రి పదవి రాలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

మంత్రి వర్గ మార్పుల్లో చిన్నపాటి సమస్యలున్నా సర్దుకుంటాయని అన్నారు. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రానికి ఇతోధిక ప్రాధాన్యం ఇచ్చినందుకు ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞలు చెప్పారు. అవకాశం వస్తే చిరంజీవి పార్టీకి నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు.

English summary
TRS chief K Chandrasekhar Rao reached to Hyderabad on Sunday night from his farm house, which is in Medak district. PCC chief Botsa Satyanarayana invited KCR to his daughter's marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X